ఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ | India pair in Seoul Open finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్‌–రామ్‌ జోడీ

Nov 3 2024 4:11 AM | Updated on Nov 3 2024 4:11 AM

India pair in Seoul Open finals

సాక్షి, హైదరాబాద్‌: సియోల్‌ ఓపెన్‌ ఏటీపీ–100 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ జంట 7–6 (9/7), 6–4తో జాషువ పారిస్‌ (ఇంగ్లండ్‌)–నామ్‌ జి సంగ్‌ (జపాన్‌) ద్వయంపై గెలిచింది. 

ఒక గంట 36 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ‘టై బ్రేక్‌’లో దక్కించుకున్న సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం... రెండో సెట్‌లో అదే జోరు కొనసాగిస్తూ విజయం సాధించింది. సాకేత్‌–రామ్‌కుమార్‌ జంట 6 ఏస్‌లు సంధించి ఆధిక్యం ప్రదర్శించగా... ప్రత్యర్థి జోడీ రెండు ఏస్‌లకు పరిమితమై... రెండు డబుల్‌ ఫాల్ట్స్‌ చేసింది. 

ఒక టై బ్రేక్‌ నెగ్గిన సాకెత్‌–రామ్‌కుమార్‌ ద్వయం... ఓవరాల్‌గా 77 పాయింట్లు సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో వాసిల్‌ కిర్కోవ్‌ (అమెరికా)–బార్ట్‌ స్టీవెన్స్‌ (నెదర్లాండ్స్‌) జంటతో సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీ తపలడనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement