FIH Hockey Pro League: విజయంతో భారత్‌ ముగింపు

India Beat Germany 3-1 To End Home Stint On A High - Sakshi

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో స్వదేశీ అంచె మ్యాచ్‌లను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. జర్మనీ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో అమిత్‌ రోహిదాస్‌ సారథ్యంలోని భారత్‌ 3–1తో గెలిచింది. టీమిండియా తరఫున సుఖ్‌జీత్‌ సింగ్‌ (19వ ని.లో), వరుణ్‌ (41వ ని.లో), అభిషేక్‌ (54వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు.

జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బోయెకెల్‌ (45వ ని.లో) సాధించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... జర్మనీ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లను ఆంట్‌వర్ప్‌లో బెల్జియంతో జూన్‌ 11, 12న... రోటర్‌డామ్‌లో నెదర్లాండ్స్‌తో జూన్‌ 18, 19న తలపడుతుంది.

చదవండి: IPL 2022: దీపక్‌ చహర్‌ ఔట్‌.. సీఎస్‌కే అధికారిక ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top