IND Vs AUS 3rd T20: ఉప్పల్‌ స్టేడియంకు చేరుకున్న భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు..

India, Australia Players Reach Rajiv Gandhi International stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలక పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్‌ ఫలితాన్ని డిసైడ్‌ చేసే మూడో టీ20లో తాడాపేడో తెల్చుకోవడానికి భారత్‌- ఆసీస్‌ జట్లు సిద్దమయ్యాయి.

ఇరు జట్లు మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈక్రమంలో ఇరు జట్లు తమ హోటల్‌ నుంచి భారీ భద్రత మధ్య స్టేడియం చేరుకున్నారు. ఇక స్టేడియం చేరుకున్నాక ఇరు జట్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేయనున్నారు. కాగా ఉప్పల్‌ వేదికగా ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ జరిగింది.

భారత్‌- వెస్టిండీస్‌ మధ్య 2019లో టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి  (50 బంతుల్లో 94 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

 ఇక ఇదే వేదికలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా నాలుగుసార్లు (మూడు వన్డేలు, ఒక టెస్టు) తలపడ్డాయి. రెండుసార్లు భారత్‌... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య సిటీలో తొలిసారి పోరు జరగనుంది. 
చదవండిబీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top