Ind Vs Wi 3rd T20- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..!

Ind Vs Wi 3rd T20: Rohit Sharma Rare Captaincy Record Surpass Virat Kohli - Sakshi

Ind Vs Wi T20 Series- India Clean Sweep Series 3-0: వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా సిరీస్‌ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. పర్యాటక విండీస్‌ జట్టును 3-0తో వైట్‌వాష్‌ చేసి సత్తా చాటింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీ(65)కి తోడు బౌలర్లు హర్షల్‌ పటేల్‌(3 వికెట్లు), దీపక్‌ చహర్‌(2), వెంకటేశ్‌ అయ్యర్‌(2), శార్దూల్‌ ఠాకూర్‌(2) అద్భుతంగా రాణించడంతో విజయం టీమిండియా సొంతమైంది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్‌ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్‌ చేసిన భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. కాగా 2017లో కోహ్లి గైర్హాజరీలో రోహిత్‌ సారథ్యంలోని రోహిత్‌ సేన శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే విధంగా 2018లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. 

ఇక విరాట్‌ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న క్రమంలో రోహిత్‌ శర్మ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాం​డ్‌(2021)తో సిరీస్‌ను వైట్‌వాష్‌(3-0) చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ జాబితాలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌(5 విజయాలు), అఫ్గనిస్తాన్‌ ఆటగాడు అస్గర్‌ అఫ్గర్‌(4) రోహిత్‌ కంటే ముందు వరుసలో ఉన్నారు. 

కోహ్లిని దాటేశాడు...
అదే విధంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును కూడా రోహిత్‌ ఈ మ్యాచ్‌ విజయం ద్వారా అధిగమించాడు. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. సొంతగడ్డ మీద రోహిత్‌ సారథ్యంలో 15 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌లు గెలిచింది. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, కేన్‌ విలియమ్సన్‌ 15 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్‌... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top