IND vs SA 2nd ODI: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్‌ సమర్పయామి

Ind Vs Sa ODI Series: 2nd ODI Updates And Highlights In Telugu - Sakshi

IND vs SA 2nd ODI : సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో జానేమన్‌ మలన్‌ 91, క్వింటన్‌ డికాక్‌ 78, బవుమా 35 రాణించగా.. చివర్లో మార్ర్కమ్‌ 35 నాటౌట్‌, డసెన్‌ 34 నాటౌట్‌ మిగిలిన లాంచనాన్ని పూర్తి చేశారు. ఫ్లాట్‌గా ఉన్న వికెట్‌పై టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిలపడిపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్‌, చహల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.  

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్‌(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్‌ రాహుల్‌(55), పంత్‌(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్‌, రాహుల్‌ ఔట్‌ కావడంతో టీమిండియా బ్యాటింగ్‌ తడబడింది. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ 40 నాటౌట్‌ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 2, మగల, మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

9:10 PM: విజయం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 91 పరుగులు చేసిన ఓపెనర్ మలాన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయగా.. ఆ తర్వాత చహల్‌ బౌలింగ్‌లో బవుమా(35) కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులతో ఆడుతోంది. ప్రొటీస్‌ విజయానికి ఇంకా 72 పరుగుల దూరంలో ఉంది. మార్క్రమ్‌, డసెన్‌లు క్రీజులో ఉన్నారు.

8:07 PM: టీమిండియా ఎట్టకేలకు వికెట్‌ సాధించింది. ఆరంభం నుంచి దూకుడు కనబరుస్తున్న సౌతాఫ్రికాను శార్దూల్‌ దెబ్బ తీశాడు. దాటిగా ఆడుతున్న డికాక్‌(78)ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. 

7:25 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా డికాక్‌ ఆరంభం నుంచి భారీ షాట్లు ఆడుతూ అర్థశతకం సాధించాడు. 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన డికాక్‌ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. జానేమన్‌ మలన్‌ 40 పరుగులతో డికాక్‌కు సహకరిస్తున్నాడు.  ప్రస్తుతం 17 ఓవర్లలో సౌతాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా 109 పరుగులు చేసింది.

7:10 PM: 10 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. డికాక్‌ 48, జానేమన్‌ మలన్‌ 20 పరుగులతో ఆడుతున్నారు.

6:47 PM: 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. డికాక్‌ 29, జానేమన్‌ మలన్‌ 4 పరుగులతో ఆడుతున్నారు.

6:00 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆరంభంలోనే ధావన్‌(29), కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి.. కేఎల్‌ రాహుల్‌(55), పంత్‌(85) పరుగులు చేయడంతో పాటు.. మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో టీమిండియా 183/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ వెనువెంటనే పంత్‌, రాహుల్‌ ఔట్‌ కావడంతో టీమిండియా బ్యాటింగ్‌ తడబడింది. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ 40 నాటౌట్‌ ఆకట్టుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్‌ షంసీ 2, మగల, మార్క్రమ్‌, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

5:43 PM: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ 32, అశ్విన్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

4:57 PM: తబ్రైజ్‌ షంసీ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌(11) ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 11, శార్దూల్‌(0)  ఆడుతున్నారు.

4:37 PM: టీమిండియా కేఎల్‌ రాహుల్‌(55), రిషబ్‌ పంత్‌(85) రూపంలో వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 55 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ మగల బౌలింగ్‌లో డసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత షంసీ వేసిన 33వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన పంత్‌ మార్ర్కమ్‌కు చిక్కాడు. ప్రస్తుతం 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

4:14 PM: ధావన్‌, కోహ్లిలు ఔటైన తర్వాత కేఎల్‌ రాహుల్‌, పంత్‌ కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కేఎల్‌ అర్థశతకం సాధించాడు. అంతకముందు పంత్‌ 43 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ 44 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.

03:00 PM: టీమిండియా వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. ధావ‌న్‌( 29) ప‌రుగులు చేసి మ‌ర‌క్రామ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేర‌గా, విరాట్ కోహ్లి కేశ‌వ్ మ‌హారాజ్ బౌలింగ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. పంత్‌ 10, రాహుల్‌ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

02:25 PM: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిల‌క‌డ‌గా ఆడుతుంది. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట పోకుండా 33 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో రాహ‌ల్‌(10), ధావ‌న్‌(17) ప‌రుగులతో ఉన్నారు.

1:40 PM: ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డేలో టీమిండియా తాడో పేడో తేల్చుకోవ‌డానికిసిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.  సిరీస్‌లో నిలవాలంటే త‌ప్ప‌నిసారిగా ఈ మ్యాచ్‌లో భార‌త్‌ గెల‌వాలి. ఇక ఈ మ్యాచ్‌లో ఎటు వంటి మార్పులు లేకుండానే భార‌త్ బ‌రిలోకి దిగింది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఒక మార్పుతో ఈ మ్యాచ్ ఆడ‌నుంది. ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ప్రోటిస్ జ‌ట్టు ముందుంజ‌లో ఉంది. 

తుది జట్లు:
టీమిండియా: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చహల్‌.

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌, జానేమన్‌ మలన్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, రసీ  వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, ఆండిలే ఫెహ్లూక్వాయో, మ‌గాలా, కేశవ్‌ మహరాజ్‌, తబ్రేజ్‌ షంషీ, లుంగి ఎంగిడి.

చ‌ద‌వండి: యూసుఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్‌ .. కేవ‌లం 40 బంతుల్లో..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top