Ind vs Sa ODI Series: రుతురాజ్‌కు నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం!

దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్ విజయంతో బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. జనవరి 19 నుంచి బోలాండ్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్‌కు టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ప్రస్థానం ముగిసిపోయిన తర్వాత ఇదే అతడికి తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో కోహ్లి ఆడనున్నాడు. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెన్నై ఓపెనర్‌గా అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, కేకేఆర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ కూడా ఈ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఈ క్రమంలో కేఎల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎవరికి లభిస్తుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
అంతేగాక తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న విషయంపై క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ తొలి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ధావన్‌కు అవకాశమిచ్చిన ఈ మాజీ ఓపెనర్... మిడిలార్డర్ బ్యాటర్లుగా కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. ఇక తన బౌలింగ్ టీమ్‌లో చహల్ ఉంటాడని స్పష్టం చేశాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్- తొలి మ్యాచ్‌కు వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు:
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్/సిరాజ్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా.
చదవండి: తాగింది చాలు.. ఇక దొబ్బేయండి! క్రికెటర్లకు ఘోర అవమానం.. తరిమేసిన పోలీసులు!
Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే: సిరాజ్ భావోద్వేగం
My Indian team for first ODI:
1. KL (C)
2. Shikhar
3. Virat
4. S Iyer
5. Pant (WK)
6. Surya
7. Shardul
8. Ashwin
9. Bhuvi / Siraj
10. Chahal
11. BumrahWhat's yours? #SAvIND
— Wasim Jaffer (@WasimJaffer14) January 18, 2022
𝐇𝐞𝐚𝐝𝐬𝐡𝐨𝐭𝐬 𝐭𝐢𝐦𝐞 📸 📸
A snippet from #TeamIndia's headshots shoot ahead of the ODI series against South Africa. 👌 👌#SAvIND pic.twitter.com/gPHarEwKTV
— BCCI (@BCCI) January 18, 2022
సంబంధిత వార్తలు