SA vs IND:"రాహుల్‌ కాదు.. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు"

Wasim Jaffer: Rahane should have led in Virat Kohli absence - Sakshi

జొహాన్స్‌ బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్‌1-1తో సమమైంది. గాయం కారణంగా సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. కాగా రెండో టెస్ట్‌లో భారత్‌ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. విరాట్‌ కోహ్లి రెండో టెస్ట్‌కు దూరం కావడంతో టీమిండియా ఓటమి చెందింది అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ మైదానంలో దూకుడుగా ఉంటాడని, ప్రతి ఒక్క ఆటగాడిపై దృష్టి సారిస్తాడని అతడు తెలిపాడు. అయితే విరాట్‌ స్దానంలో కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టిన రాహుల్‌లో ఆ లక్షణాలు కనిపించ లేదని జాఫర్‌ పేర్కొన్నాడు.

"జొహాన్స్‌బర్గ్‌ టెస్ట్‌లో టీమిండియా కచ్చితంగా విరాట్‌ సేవలను కోల్పోయింది. అతడు మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్ధిలకు వ్యతేరేకంగా వ్యూహాలను రచిస్తాడు. గొప్ప ఎనర్జీతో జ జట్టును ముందుకు నడిపిస్తాడు. కాగా విరాట్‌ స్ధానంలో కెప్టెన్‌గా రాహుల్‌ని ఎంపిక చేయడం​ నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అజింక్యా రహానే అందుబాటులో ఉన్నప్పుడు, కేఎల్ రాహుల్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు.  రహానే సారధ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కేఎల్ రాహుల్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. అతడు కొన్నాళ్లుగా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కోహ్లి గైర్హాజరీలో రహానే జట్టుకు నాయకత్వం వహించి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను" అని జాఫర్‌ పేర్కొన్నాడు.

చదవండి: Jason Roy: తండ్రైన క్రికెటర్‌... చిన్ని తండ్రికి స్వాగతం అంటూ ఎమోషనల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top