IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్‌! పటిదార్‌ అరంగేట్రం!

IND vs SA: Indias predicted playing XI for 2nd ODI - Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్‌.. ఇప్పుడు రెండో వన్డేలో తలపడేందకు సిద్దమైంది. రాంఛీ వేదికగా ఆక్టోబర్‌9 భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏలగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ధావన్‌ సేన భావిస్తోంది.

మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా తొలి వన్డే జోరును కొనసాగించి సిరీస్‌ కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ప్రస్తుతం మూడు సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.

ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో విఫలమైన రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో యువ ఆటగాడు రజిత్‌ పటిదార్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది. లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డేలో 42 బంతులు ఎదర్కొన్న రుత్‌రాజ్‌ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది.

తుది జట్లు(అంచనా)
టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజిత్‌ పటిదార్‌, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ
చదవండి: T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్‌- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top