
Ind vs SA 3rd ODI- Rajat Patidar Makes His Debut: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పర్ల్ వేదికగా గురువారం మొదలుకానుంది. ఇందులో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే తాము బరిలోకి దిగుతున్నట్లుప్రొటిస్ సారథి ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు.
రజత్ పాటిదార్ అరంగేట్రం
మరోవైపు.. తాము రెండు మార్పులతో మైదానంలో దిగనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. టీమిండియా తరఫున రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనున్నాడన్న రాహుల్.. రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలిపాడు.
గెలిచి తీరాల్సిందే
అదే విధంగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టుకి ఎంపిక చేసినట్లు రాహుల్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే! తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది.
టీమిండియా- సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లు ఇవే:
సౌతాఫ్రికా:
రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.
భారత్:
సంజూ శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.
A look at #TeamIndia's Playing XI for the third and final ODI 👌👌
— BCCI (@BCCI) December 21, 2023
Rajat Patidar is set to make his ODI debut 👏👏
Follow the Match ▶️ https://t.co/nSIIL6gzER#TeamIndia | #SAvIND pic.twitter.com/3qHkp6M32u