Ind Vs Sa 2nd Test: Big Blow Virat Kohli Not Playing Check XI Of Both Teams - Sakshi
Sakshi News home page

Ind Vs Sa 2nd Test: కోహ్లి అవుట్‌... కెప్టెన్‌గా రాహుల్‌.. తుది జట్టులో హనుమ విహారి

Published Mon, Jan 3 2022 1:17 PM

Ind Vs Sa 2nd Test: Big Blow Virat Kohli Not Playing Check XI Of Both Teams - Sakshi

Ind Vs Sa 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి వైదొలిగాడు. ఇక కోహ్లి స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చాడు.  ఇక కేఎల్ రాహుల్‌ రెండో టెస్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్‌ గెలిచిన రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.


ఇక​ దక్షిణాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగింది. క్వింటన్‌ డికాక్‌ స్థానంలో వెరెనె జట్టులోకి రాగా... డువానే ఒలివర్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా సెంచూరియన్‌ టెస్టులో విజయం సాధించి టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తుది జట్లు:
భారత్‌:
కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

చదవండి: Rahul Dravid - Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్‌!

Advertisement
Advertisement