
గత మ్యాచ్‌లో భారత జట్టు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాటు యుద్ధం, సైనికుల ప్రస్తావన తీసుకొచ్చి క్రీడలతో రాజకీయాలు చేసిందని పాక్ వైపు నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాము మాత్రం అలాంటి రెచ్చగొట్టే పనులు, సైగలను తగ్గించుకోమని వారు చూపించారు. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫర్హాన్ బ్యాట్‌ను ఏకే–47 గన్ తరహాలో ఎక్కు పెట్టి పేలుస్తున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ సైగ వారి ఆలోచనాధోరణిని చూపించింది.