IND vs NZ 1st Test: 'పాకిస్తాన్‌ ముర్దాబాద్‌'.. స్టేడియంలో ఫ్యాన్స్‌ అరుపులు

IND vs NZ 1st Test: Crowd Chants Pakistan Murdabad During 1st Day Play - Sakshi

IND vs NZ 1st Test Crowd Chants 'Pakistan Murdabad' During Play...  క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మైదానంలో ప్రేక్షకులు ఉంటేనే కిక్కు వస్తుంది. వారు చేసే గోలలు.. ఈలలు మ్యాచ్‌ ఆడుతున్న ఆటగాళ్లతో పాటు.. టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. కరోనా ప్రభావంతో ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. 

చదవండి: Ravindra Jadeja: ఫిప్టీ కొట్టాడు.. తన స్టైల్లో మళ్లీ తిప్పేశాడు

తాజాగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించారు. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో అభిమానుల్లో జోష్‌ మరింత పెరిగింది.ఎందుకంటే మొదట బ్యాటింగ్‌ చేస్తే కనీసం ఫోర్లు, సిక్సర్లు కొడతారన్న భావన ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేయడం చూస్తుంటాం. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ 6వ ఓవర్లో ఓపెనర్లు గిల్‌, మయాంక్‌ క్రీజులో ఉ‍న్నారు. ఈ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ''పాకిస్తాన్‌ ముర్దాబాద్‌..ముర్దాబాద్‌ పాకిస్తాన్‌'' అంటూ అరవడం ఆసక్తి కలిగించింది.

న్యూజిలాండ్‌ ఆటగాళ్లు పాకిస్తాన్‌ పేరు వినగానే ఆశ్చర్యానికి లోనయ్యారు. టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌ పర్యటనను  భద్రత కారణాల పేరుతో న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. ఈ కారణంగా న్యూజిలాండ్‌ కూడా ఫ్యాన్స్‌ అరుపులపై ఆసక్తి చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: Shreyas Iyer: డెబ్యూతోనే అదరగొట్టిన అయ్యర్‌.. పుజారా, రహానేలకు హెచ్చరిక!

ఇక టీమిండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి 9 ఏళ్లు అవుతుంది. 2012లో చివరిసారి భారత్‌- పాకిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరిగింది. అప్పటినుంచి ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరుజట్లు ఎదరుపడుతూ వచ్చాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సిరీస్‌లు నిర్వహించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరగనుండడంతో అప్పటిలోగా పాకిస్తాన్‌తో సిరీస్‌ ప్లాన్‌ చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top