IND Vs ENG 1st Test Day 4: ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. భారత్‌ టార్గెట్‌ 209 పరుగులు

IND Vs ENG 1st Test Day 4 Updates And Highlights - Sakshi

► భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్‌ 303 ఆలౌట్‌.. భారత్‌ టార్గెట్‌ 209 పరుగులు.

► టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సిరాజ్‌ బౌలింగ్‌లో 18 పరుగులు చేసిన రోరీ బర్న్స్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బుమ్రా 17వ ఓవర్‌ చివరి బంతికి జాక్‌ క్రాలీని వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆటకు పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మూడు రోజుల ఆట పూర్తైంది. ఇక నాలుగో రోజు ఆటలోనూ వరుణుడి ముప్పు పొంచి ఉంది. కాగా ఇంగ్లండ్‌ ఓవర్‌ నైట్‌ స్కోరు 25 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించింది. ప్రస్తుతం 14 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. రోరీ బర్న్స్‌ 18, డొమినిక్‌ సిబ్లీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. అంత‍కముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్‌ కావడంతో 95 పరుగుల ఆధిక్యం లభించింది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top