ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు.
ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు.
3 మ్యాచ్‌ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్‌లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్‌లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర. కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి టైటిల్‌ను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2026: 'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
Wtf is Virat Kohli cooking in nets. Man is Dealing only in sixes 😭😭
Someone really said, 2026 is the new 2016. pic.twitter.com/rSBD0HUkmc— Selfless⁴⁵ (@SelflessCricket) March 18, 2026


