IND VS AUS 2nd Test: పుట్టిన రోజున బుమ్రాకు చేదు అనుభవం | IND VS AUS 2nd Test: Jasprit Bumrah Becomes Fourth Indian To Register Test Duck On Birthday | Sakshi
Sakshi News home page

IND VS AUS 2nd Test: పుట్టిన రోజున బుమ్రాకు చేదు అనుభవం

Dec 6 2024 7:51 PM | Updated on Dec 6 2024 7:55 PM

IND VS AUS 2nd Test: Jasprit Bumrah Becomes Fourth Indian To Register Test Duck On Birthday

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఇవాళ (డిసెంబర్‌ 6) 31వ పడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు నాడు బుమ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ పుట్టిన రోజున బుమ్రా డకౌటయ్యాడు. భారత క్రికెట్‌ చరిత్రలో బుమ్రాకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే తమ పుట్టిన రోజున డకౌటయ్యారు (టెస్ట్‌ మ్యాచ్‌ల్లో). 

1978లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్‌ కిర్మాణి.. 1996లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటపతి రాజు.. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మ తమ పుట్టిన రోజున డకౌటయ్యారు. తాజాగా జస్ప్రీత్‌ బుమ్రా పై ముగ్గురి సరసన చేరాడు.

అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా 8 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు. కమిన్స్‌ బౌలింగ్‌ ఉస్మాన్‌ ఖ్వాజాకు క్యాచ్‌ ఇచ్చి బుమ్రా ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌ తొలి రోజు టీమిండియాపై ఆస్ట్రేలియా పైచేయి సాధించింది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మిచెల్‌ స్టార్క్‌ (6/48) ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్‌, బోలాండ్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

భారత ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్‌ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31), అశ్విన్‌ (22), రిషబ్‌ పంత్‌ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్‌ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా, బుమ్రా డకౌట్‌ అయ్యారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆసీస్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్‌ ఖ్వాజా (13) ఔట్‌ కాగా.. మార్నస్‌ లబుషేన్‌ (20), నాథన్‌ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement