పాక్‌ బ్యాటర్‌ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

పాక్‌ బ్యాటర్‌ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్‌

Published Thu, Feb 22 2024 7:54 AM

Iftikhar Ahmed Goes Slam Bang At Zaman Khan - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్‌ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చివరిలో సుల్తాన్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఇఫ్తికర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే  5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 19 ఓవర్‌ వేసిన లహోర్‌ పేసర్‌ జమాన్‌ ఖాన్‌కు ఇఫ్తి భాయ్‌ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. డగౌట్‌ నుంచి ఇఫ్తికర్‌ విధ్వంసం​ చూసిన రిజ్వాన్‌ బిత్తరపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్‌ పాక్‌ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లాహోర్ ఖలందర్స్‌ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్‌ డస్సెన్‌(54) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ముల్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్‌ తలా వికెట్‌ పడగొట్టారు.
చదవండిAFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్‌

Advertisement
 
Advertisement