అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా.. కానీ! | ICC mens ODI team rankings: Team India retain top spot Annual update | Sakshi
Sakshi News home page

ICC: అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా.. కానీ!

Jun 11 2026 1:53 PM | Updated on Jun 11 2026 3:04 PM

ICC mens ODI team rankings: Team India retain top spot Annual update

టీమిండియా వన్డేల్లో తమ ఆధిపత్యం కొనసాగించింది. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, రేటింగ్‌ పాయింట్లలో మాత్రం తరుగుదల నమోదు చేసింది. ఇక న్యూజిలాండ్‌ రెండో స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటురేటింగ్‌ పాయింట్లు కూడా మెరుగుపరచుకుంది.

పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి 
మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్‌ రేటింగ్‌ పాయింట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఇక.. సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి దూసుకువచ్చింది.  

కాగా స్వదేశంలో చివరగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడింది టీమిండియా. మూడు మ్యాచ్‌లలో రెండింట ఓడి కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుంది. ఈ క్రమంలోనే భారత జట్టు ఒక రేటింగ్‌ పాయింట్‌ (119 నుంచి 118కి) కోల్పోయింది.

అదే సమయంలో భారత గడ్డపై సత్తా చాటిన న్యూజిలాండ్‌ రెండు రేటింగ్‌ పాయింట్లు పొందింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.

అయితే, దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడటం ప్రతికూలాంశంగా మారింది. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. అయితే, హార్దిక్‌ పాండ్యా రీప్లేస్‌మెంట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న జట్లు
1.ఇండియా- 118 రేటింగ్‌ పాయింట్లు
2. న్యూజిలాండ్‌- 113 రేటింగ్‌ పాయింట్లు
3. ఆస్ట్రేలియా- 103 రేటింగ్‌ పాయింట్లు
4. సౌతాఫ్రికా- 102 రేటింగ్‌ పాయింట్లు
5. పాకిస్తాన్‌- 100 రేటింగ్‌ పాయింట్లు
6. శ్రీలంక- 96 రేటింగ్‌ పాయింట్లు
7. అఫ్గనిస్తాన్‌- 93 రేటింగ్‌ పాయింట్లు
8. ఇంగ్లండ్‌- 89 రేటింగ్‌ పాయింట్లు
9. బంగ్లాదేశ్‌- 86 రేటింగ్‌ పాయింట్లు
10. వెస్టిండీస్‌- 73 రేటింగ్‌ పాయింట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement