
హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)2024 ఎడిషన్‌కు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్‌గా ప్రణవి రికార్డు నెలకొల్పింది.
సీపీఎల్‌కు ఎంపికైన సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ప్రణవిని సన్మానించారు. అలాగే ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ప్రణవి సీపీఎల్‌లో మెరుగ్గా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 22 ఏళ్ల ప్రణవి రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. హైదరాబాద్ టీమ్‌తో పాటు ప్రణవి సౌత్ జోన్ టీమ్ కూడా ప్రాతినిథ్యం వహించింది.