ఎలైట్‌ డివిజన్‌కు హైదరాబాద్, మేఘాలయ | Hyderabad and Meghalaya for elite division | Sakshi
Sakshi News home page

ఎలైట్‌ డివిజన్‌కు హైదరాబాద్, మేఘాలయ

Feb 12 2024 3:49 AM | Updated on Feb 12 2024 3:49 AM

Hyderabad and Meghalaya for elite division - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన హైదరాబాద్‌ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా వచ్చే సీజన్‌లో ఎలైట్‌ డివిజన్‌లో పోటీ పడేందుకు అర్హత సంపాదించింది. ఉప్పల్‌ స్టేడియంలో నాగాలాండ్‌ జట్టుతో ఆదివారం ముగిసిన తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 68 పరుగుల తేడాతో గెలిచింది.

మరోవైపు రెండో సెమీఫైనల్లో మేఘాలయ ఆరు వికెట్ల తేడాతో మిజోరం జట్టును ఓడించి హైదరాబాద్‌తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఫైనల్‌ చేరడంతో మేఘాలయ జట్టు కూడా వచ్చే సీజన్‌లో ఎలైట్‌ డివిజన్‌లో ఆడుతుంది.

హైదరాబాద్‌తో జరిగిన సెమీఫైనల్లో మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 20/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన నాగాలాండ్‌ 58.3 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ 81 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... కెపె్టన్‌ తిలక్‌ వర్మ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement