Asia Cup Qualifiers 2022: Hong Kong Beats UAE To Qualify For Asia Cup, Joins India And Pakistan In Group A - Sakshi
Sakshi News home page

ASIA CUP 2022: ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్‌.. భారత్‌, పాక్‌తో ఢీ!

Aug 25 2022 9:11 AM | Updated on Aug 25 2022 11:44 AM

Hong Kong beats UAE to qualify for Asia Cup - Sakshi

ఆసియా కప్-2022 కు హాంకాంగ్‌ ఆరో జట్టుగా అర్హత సాధించింది. బుధవారం ఒమన్‌ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన అఖరి మ్యాచ్‌లో విజయం సాధించిన హాంకాంగ్‌ ఆసియా కప్‌లో అడుగు పెట్టింది. హాంకాంగ్‌ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్‌.. అన్నింటిలోనూ విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది.

తద్వారా ఈ మెగా ఈవెంట్‌ గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్తాన్‌ జట్లతో హాంకాంగ్‌ చేరింది. హాంకాంగ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న దుబాయ్‌ వేదికగా టీమిండియాతో తలపడనుంది. కాగా ఆసియాకప్‌-టీ20 ఫార్మాట్‌లో పాల్గొనడం ఇదే తొలి సారి. ఇక ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఇప్పటి వరకు మూడు సార్లు భాగమైంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 147 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో సీపీ రిజ్వాన్‌(49), ఫరీద్‌ (41) పరుగులతో రాణించారు. హాంకాంగ్‌ బౌలర్లలో ఇషాన్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా..శుక్ల మూడు, ఆజీజ్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశారు.

ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హాంకాంగ్‌ బ్యాటర్లో యాసిమ్ ముర్తాజా 58 పరుగులతో టాప్‌ స్కో్‌రర్‌గా నిలవగా.. నిజాకత్ ఖాన్ (39),బాబర్‌ హయత్‌(38) పరుగులతో రాణించారు. ఇక ఆసియాకప్‌-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికాగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
చదవండి: Asia Cup 2022: టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement