పదే పదే అదే ప్రశ్న.. పీవీ సింధు ఆన్సర్‌ ఇదే | Sakshi
Sakshi News home page

ఎవరితోనైనా డేటింగ్‌ చేశారా? పదే పదే అదే ప్రశ్న.. సింధు ఆన్సర్‌ ఇదే

Published Tue, Dec 5 2023 4:13 PM

Have You Dated Anyone: PV Sindhu Encounters Awkward Question Replies - Sakshi

PV Sindhu Comments: తమ అభిమాన ఆటగాళ్ల రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏమిటన్న అంశంపై క్యూరియాసిటీ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాబట్టి ఇంటర్వ్యూ చేసే వాళ్లు కూడా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల గురించి అడగటం కామన్‌. బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధుకు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఆట గురించి కాకుండా పదే పదే ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడగటంతో దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది సింధు.

మీ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటి?
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సింధును.. మీ రిలేషన్‌ స్టేటస్‌ ఏమిటని అడగగా.. సింగిల్‌ అని బదులిచ్చింది. ‘‘ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ మీదే నా ధ్యాస. ఒలింపిక్స్‌లో మరో మెడల్‌ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొంది.

అనంతరం.. ‘‘మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘‘ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. అయితే, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో డెస్టినీలో ఉంటుంది. నా నుదిటి రాతపై ఏది ఉంటే అదే జరుగుతుంది’’ అని ఈ ఒలింపియన్‌ సమాధానమిచ్చింది.

ఆ తర్వాత మరో ప్రశ్న.. ‘‘మీరు ఎవరితో అయినా డేటింగ్‌ చేశారా?’’.. ఈసారి సింధు.. ‘‘లేదు.. అస్సలు లేదు’’ అని బదులిచ్చింది. అదే విధంగా.. ‘‘అసలు ఇలాంటి విషయాల గురించి అంతగా ఆలోచించే పనిలేదు. జీవితం అలా సాగిపోతుందంతే! ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్‌ఎస్‌ క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అద్భుత ఆట తీరుతో ఎవరికీ సాధ్యం కాని రీతిలో
కాగా.. పూసర్ల వెంకట సింధు ఇప్పటికే రెండుసార్లు విశ్వక్రీడల్లో పతకాలు సాధించింది. రియో ఒలింపిక్స్‌-2016లో రజతం గెలిచిన ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం అందుకుంది. తద్వారా రెండుసార్లు ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది.

ఇక ప్రస్తుతం సింధు దృష్టి మొత్తం ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంపైనే కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఇప్పటికే బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణే మార్గదర్శనంలో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ప్రకాశ్‌ సర్‌ కేవలం తన మెంటార్‌, గురు మాత్రమే కాదని.. మంచి స్నేహితుడిలా తనను గైడ్‌ చేస్తూ ఉంటారని సింధు ఒక సందర్భంలో చెప్పింది.

చదవండి: WC T20: గాయాలతో హార్దిక్‌ సతమతం.. బీసీసీఐ కీలక నిర్ణయం! ఇక అతడికే పగ్గాలు..

Advertisement
 
Advertisement
 
Advertisement