భార్యతో హార్దిక్‌కు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్‌! | Sakshi
Sakshi News home page

H్‌Hardik Pandya: భార్యతో హార్దిక్‌ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్‌ వైరల్‌

Published Thu, May 23 2024 12:24 PM

Hardik Pandya Wife Natasa Stankovic Sparks Separation Rumours Fans Reacts

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు గత కొద్ది నెలలుగా ఏదీ కలిసి రావడం లేదు. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన ఈ బరోడా క్రికెటర్‌.. మళ్లీ ఐపీఎల్‌-2024 సీజన్‌తో పునరాగమనం చేశాడు.

చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకుని క్యాష్‌ రిచ్‌ లీగ్‌ బరిలో నిలిచాడు. కష్టకాలంలో తనపై నమ్మకం ఉంచి.. కెప్టెన్సీ అనుభవం లేకున్నా పగ్గాలు అప్పగించిన గుజరాత్‌ టైటాన్స్‌ను ‌వీడి తిరిగి ముంబై ఇండియన్స్‌ గూటికి చేరాడు.

స్టేడియంలో, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌
ఈ క్రమంలో ముంబై యాజమాన్యం రోహిత్‌ శర్మపై వేటు వేసి హార్దిక్‌ పాండ్యాను సారథిగా నియమించింది. అప్పటి నుంచి హార్దిక్‌ కష్టాలు మొదలయ్యాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్‌ చేయడంతో అభిమానులు ముంబై యాజమాన్యంపై ఫైర్‌ అయ్యారు.

స్టేడియంలో, సోషల్‌ మీడియాలో హార్దిక్‌ పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. ఇక ఆట తీరుతోనైనా అభిమానుల మనసు గెలవాలని హార్దిక్‌ పాండ్యా భావించగా.. ఆ ఆశ కూడా నెరవేరలేదు. చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది.

చెత్త కెప్టెన్సీ వల్ల అట్టడుగున ముంబై
లీగ్‌ దశలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆల్‌రౌండర్‌గానూ పాండ్యా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2024 భారత జట్టులోనూ హార్దిక్‌ పాండ్యా స్థానం ప్రశ్నార్థకం కాగా.. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అదృష్టవశాత్తూ సెలక్టర్లు అతడిని మెగా టోర్నీకి ఎంపిక చేశారు.

భార్య నటాషాతో హార్దిక్‌కు విభేదాలు?
ఇక కెరీర్‌ విషయం ఇలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెరమీదకు వచ్చింది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌ బంధం బీటలు వారిందనేది దాని సారాంశం. 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయకపోవడమే ఇందుకు కారణం అన్నట్లుగా ‘రెడిట్‌’ ఓ పోస్ట్‌ పెట్టింది.

ఈ క్రమంలో కొంత మంది హార్దిక్‌- నటాషా విడిపోనున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే, వారి అభిమానులు మాత్రం ఇవన్నీ వట్టి వదంతులే అని కొట్టి పారేస్తున్నారు. హార్దిక్‌, అతడి కుటుంబంతో నటాషా దిగిన ఫొటోలు ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

మరి ఎందుకు ఇలా?
ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్‌ పాండ్యాపై సోషల్‌మీడియాలో కొంత మంది పనిగట్టుకుని మరీ విద్వేష విషం చిమ్మిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన పాండ్యా.. ఈ ప్రభావం తన భార్యాబిడ్డపై కూడా పడుతుందేమోనని భయపడినట్లు సమాచారం.

ఆ భయం వల్లే హార్దిక్‌ వద్దన్నాడు!
అందుకే నటాషాను కొద్ది కాలం సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా తనతో ఉన్న ఫొటోలు షేర్‌ చేయవద్దని స్వయంగా చెప్పినట్లు అభిమానులు భావిస్తున్నారు. అందుకే నటాషా స్టేడియానికి కూడా రావడం మానేసిందని.. కుమారుడు అగస్త్యను కూడా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.

అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు
ఇక నుదుటిన బొట్టుతో బుధవారం ఓ ఫొటో షేర్‌ చేసిన నటాషా.. ‘‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’’ అంటూ ఫొటోను షేర్‌ చేసింది. దీంతో హార్దిక్‌- నటాషా మధ్య విభేదాలు అంటూ వస్తున్న ఊహాగానాలను ఆమె పటాపంచలు చేసినట్లయింది. కాగా నటాషా ఈ మధ్యకాలంలో పెట్టిన ప్రతీ పోస్టుకు హార్దిక్‌సోదరుడు కృనాల్‌ పాండ్యా, వదిన పాంఖురి శర్మ లైకులు కొట్టడం గమనార్హం.

చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్‌! అరుదైన రికార్డులు.. దటీజ్‌ డీకే!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement