హార్దిక్‌ పాండ్యాపై రూ. 12 లక్షలు జరిమానా  | Hardik Pandya fined Rs 12 lakhs | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యాపై రూ. 12 లక్షలు జరిమానా 

Apr 20 2024 4:07 AM | Updated on Apr 20 2024 4:07 AM

Hardik Pandya fined Rs 12 lakhs - Sakshi

ముల్లాన్‌పూర్‌: ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రూ. 12 లక్షలు జరిమానా విధించింది. ముల్లాన్‌పూర్‌లో గురువారం పంజాబ్‌ కింగ్స్‌ జట్టుతో ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో పూర్తి 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది.

దాంతో స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసినందుకు హార్దిక్‌పై పెనాల్టీని విధించారు. తాజా సీజన్‌లో ఇప్పటి వరకు స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రిషభ్‌ పంత్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌–2 సార్లు), శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌), సంజూ సామ్సన్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)లపై జరిమానా విధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement