BCCI Announced Hardik Pandya As Team India Captain For Ireland T20 Series - Sakshi
Sakshi News home page

India-Ireland T20 Series: ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా

Jun 15 2022 8:52 PM | Updated on Jun 16 2022 11:23 AM

Hardik Pandya Announced As Team India Captain For Ireland T20 Series - Sakshi

జూన్‌ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 17 మంది సభ్యుల టీమిండియాను భారత సెలెక్షన్‌ కమిటీ ఇవాళ (జూన్‌ 15) ప్రకటించింది. ఈ జట్టుకు హార్ధిక్‌ పాండ్యా నేతృత్వం వహించనుండగా, భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపికలో ఎలాంటి సంచలనాలకు తావివ్వవని సెలెక్షన్‌ కమిటీ పటిష్టమైన జట్టునే ఐర్లాండ్‌కు పంపనుంది. మరోవైపు ఇదే సమయంలో భారత సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండటం విశేషం. 

ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, హర్షల్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌
చదవండి: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ఇంగ్లండ్‌ టూర్‌కు కేఎల్‌ రాహుల్‌ దూరం..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement