హెడ్‌, క్లాసెన్ కాదు.. టీ20 క్రికెట్‌లో అతడే బెస్ట్ ప్లేయ‌ర్‌: హర్భజన్ | Harbhajan Singh Names Current Best T20 Player. Not Travis Head Or Kalasan | Sakshi
Sakshi News home page

హెడ్‌, క్లాసెన్ కాదు.. టీ20 క్రికెట్‌లో అతడే బెస్ట్ ప్లేయ‌ర్‌: హర్భజన్

Mar 28 2025 8:19 PM | Updated on Mar 28 2025 8:28 PM

Harbhajan Singh Names Current Best T20 Player. Not Travis Head Or Kalasan

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలి విజ‌యాన్ని అందుకుంది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ల‌క్నో చిత్తు చేసింది. ఈ విజ‌యంలో ల‌క్నో ఆట‌గాడు నికోల‌స్ పూర‌న్‌ది కీల‌క పాత్ర. 191 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పూర‌న్ విధ్వంసం సృష్టించాడు.

కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగలు చేశాడు. ఈ క్రమంలో పూరన్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత టీ20 క్రికెట్‌లో పూరన్ మించిన వారు లేరని అశ్విన్ కొనియాడాడు. ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. ఆ మ్యాచ్‌లో కూడా పూర‌న్ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

ఇటీవ‌ల కాలంలో పూర‌న్ టీ20ల్లో మాత్రం సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. ప్రపంచ‌వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో పూర‌న్ ఆడుతున్నాడు. ఆడిన ప్ర‌తీ చోట త‌న మార్క్‌ను నిక్కీ చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం టీ20 ఫార్మాట్‌లో  నికోల‌స్ పూర‌న్ అత్యుత్త‌మ ఆట‌గాడు అంటూ లక్నో-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ అనంత‌రం భ‌జ్జీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో పూర‌న్ 145 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ త‌ర్వాత ల‌క్నో త‌ర‌పున 1000 పరుగుల మైలురాయిని రెండవ ఆటగాడిగా పూరన్ నిలిచాడు. అతడు కేవలం 31 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు.  ఈ కరేబియ‌న్ స్టార్ ప్లేయ‌ర్ ల‌క్నో త‌ర‌పున 31 మ్యాచ్‌ల్లో 1002 పరుగులు చేశాడు. కాగా టీ20 క్రికెట్‌లో హార్డ్ హిట్ట‌ర్ల‌గా పేరు గాంచిన ట్రావిస్ హెడ్‌, హెన్రిస్ క్లాసెన్‌ల‌ను కాకుండా పూర‌న్‌ను బెస్ట్ ప్లేయ‌ర్‌గా భ‌జ్జీ ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం.
చ‌ద‌వండి: IPL 2025: ట్రావిస్ హెడ్‌నే బెంబేలెత్తించాడు.. ఎవ‌రీ ప్రిన్స్ యాద‌వ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement