అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్‌: భజ్జీ ఫైర్‌ | Harbhajan Singh lashes out at Pakistani fan for comparing MS Dhoni And Rizwan | Sakshi
Sakshi News home page

అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్‌: భజ్జీ ఫైర్‌

Jul 20 2024 10:42 AM | Updated on Jul 20 2024 3:19 PM

Harbhajan Singh lashes out at Pakistani fan for comparing MS Dhoni And Rizwan

భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జ‌ర్నలిస్ట్‌కు అద‌రి పోయే కౌంట‌రిచ్చాడు.  భార‌త మాజీ కెప్టెన్‌, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెట‌ర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు స‌దరు జ‌ర్న‌లిస్ట్‌పై హర్భజన్ మండిప‌డ్డాడు.

ఫ‌రీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్‌ జ‌ర్న‌లిస్ట్ ఎంఎస్ ధోని, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ల‌లో ఎవ‌రు బెట‌ర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భ‌జ్జీ ఇదేమి చెత్త ప్రశ్న‌ అంటూ ఫైర‌య్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భ‌య్యా అత‌డికి ఎవ‌రైనా చెప్పండి.

ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విష‌యం రిజ్వాన్‌ను అడిగినా అత‌డు  నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అత‌డు జ‌ట్టు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.

ప్రపంచ క్రికెట్‌లో ఇప్ప‌టికీ ధోనినే నంబర్ వ‌న్‌. వికెట్ల వెన‌క ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భ‌జ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్‌లో ధోని కంటూ ఒక ప్ర‌త్యేక‌స్ధాన‌ముంది.

భార‌త్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అత‌డి సార‌థ్యంలోనే 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement