ఔటైన కోపంలో ఇషాన్ కిష‌న్ ఏం చేశాడంటే.. వీడియో వైర‌ల్‌ | Frustrated Ishan Kishan Smashes the boundary cushions | Sakshi
Sakshi News home page

IPL 2022: ఔటైన కోపంలో ఇషాన్ కిష‌న్ ఏం చేశాడంటే.. వీడియో వైర‌ల్‌

Apr 17 2022 2:43 PM | Updated on Apr 17 2022 2:45 PM

Frustrated Ishan Kishan Smashes the boundary cushions - Sakshi

PC; IPL

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్  స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్ తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచ‌రీ సాధించిన కిష‌న్‌, త‌ర్వాత మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు.  ఇక శనివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఎద‌ర్కొన్న కిష‌న్ కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. ముంబై ఇన్నింగ్స్ 7 ఓవ‌ర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో.. సింగిల్ తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన కిష‌న్ బౌల్డ‌య్యాడు.

ఈ క్ర‌మంలో నిరాశ‌కు గురైన కిష‌న్ పెవిలియ‌న్‌కు వెళ్తూ బ్యాట్‌తో బౌండ‌రీ రోప్‌ను బ‌లంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే కిష‌న్ చ‌ర్య ఐపీఎల్  ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ రిఫ‌రీ అతడిపై జరిమానా విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 17 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది.

చ‌ద‌వండి: IPL 2022: "టీమిండియాలో చోటు కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నా.. అదే నా కోరిక‌"

Advertisement
 
Advertisement
Advertisement