చరిత్ర సృష్టించిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2025 ఫైనల్‌ | French Open 2025 Men's Singles Final Created History | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2025 ఫైనల్‌

Jun 9 2025 7:43 AM | Updated on Jun 9 2025 7:44 AM

French Open 2025 Men's Singles Final Created History

కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), యానిక్‌ సినెర్‌ (ఇటలీ) మధ్య నిన్న (జూన్‌ 8) జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌-2025 పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఫైనల్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌ 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. 

గతంలో ఏ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ 5 గంటలు సాగలేదు. ఈ మ్యాచ్‌ 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మాట్స్‌ విలాండర్‌, గులెర్మో విలాస్‌ మధ్య జరిగిన 1982 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ 4 గంటల 47 నిమిషాలు సాగింది.

అల్‌కరాజ్‌ అదరహో
ఊహకందని మలుపుల మధ్య సాగిన తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌పై (ఇటలీ) 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు.

5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో అల్‌కరాజ్‌ తొలి రెండు సెట్‌లను కోల్పోయినా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్‌లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్‌లో అల్‌కరాజ్‌ ఏకంగా మూడు మ్యాచ్‌ పాయింట్లను కాచుకోవడం విశేషం. 

ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ తన కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను (2025, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌... 2023, 2024 వింబుల్డన్‌... 2022 యూఎస్‌ ఓపెన్) ‌దక్కించుకున్నాడు. అల్‌కరాజ్‌ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కూడా ఓడిపోలేదు. మరోపక్క సినెర్‌కు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ పరాజయం. 

Advertisement
 
Advertisement
Advertisement