న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, టీమిండియా మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ స్థానంలో... భారత అండర్–21 పురుషుల హాకీ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఫ్రెడరిక్ సోయెజ్‌ను నియమించారు. ఫ్రాన్స్‌కు చెందిన సోయెజ్‌కు అంతర్జాతీయ ప్లేయర్‌గా 15 ఏళ్లు... హెడ్ కోచ్‌గా 15 ఏళ్లు అనుభవం ఉందని హాకీ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్ తరఫున సోయెజ్ 196 మ్యాచ్‌లు ఆడి 195 గోల్స్ చేశాడు. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్పెయిన్ జట్టుకు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్ జట్టుకు సోయెజ్ కోచ్‌గా వ్యవహరించారు.


