Rajesh Verma: గుండెపోటుతో ముంబై మాజీ పేసర్‌ మృతి

Former Mumbai pacer Rajesh Verma passes away at 40 - Sakshi

ముంబై రంజీ జ‌ట్టు పేస‌ర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విష‌యాన్ని త‌న మాజీ స‌హ‌చ‌ర ఆట‌గాడు భవిన్ థక్కర్ ధృవీకరించాడు. కాగా 2002లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాజేష్ వర్మ వ‌ర్మ అరంగేట్రం చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన వర్మ మొత్తం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అత‌డు త‌న చివ‌రి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడాడు. 7 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజేష్ వ‌ర్మ 23 వికెట్లు పడగొట్టాడు. దీంట్లో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది.

ఇక 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జ‌ట్టులో రాజేష్ వ‌ర్మ భాగంగా ఉన్నాడు. "రాజేష్ వ‌ర్మ మ‌ర‌ణ వార్త విని షాక్‌కు గురయ్యా. అండ‌ర్‌-19 నుంచి  మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాం. 20 రోజుల క్రితం మేమిద్దరం క‌లిసి ఓ టోర్నమెంట్‌లో పాల్గొన్నాం. శ‌నివారం (ఏప్రిల్ 23) నేను అత‌డితో దాదాపు 30 నిమిషాలు పాటు ఫోన్‌లో మాట్లాడాను. ఈ రోజు (ఆదివారం)  తెల్లవారుజామున 4 గంటలకు అత‌డి చనిపోయాడాని నాకు ఫోన్ వ‌చ్చింది. అత‌డు  మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. అత‌డు మ‌మ్మల్ని విడిచి వెళ్లి పోవ‌డం చాలా బాధ‌గా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఠక్కర్ పేర్కొన్నాడు.

చ‌ద‌వండి: IPL 2022: 'అతడు యార్క‌ర్ల కింగ్‌.. ఆస్ట్రేలియా విమానం ఎక్క‌నున్నాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top