'అతడు యార్క‌ర్ల కింగ్‌.. ఆస్ట్రేలియా విమానం ఎక్క‌నున్నాడు' | T Natarajan wants to be on that flight to Australia syas Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

IPL 2022: 'అతడు యార్క‌ర్ల కింగ్‌.. ఆస్ట్రేలియా విమానం ఎక్క‌నున్నాడు'

Apr 24 2022 5:28 PM | Updated on Apr 24 2022 5:30 PM

T Natarajan wants to be on that flight to Australia syas Sunil Gavaskar - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస‌ర్ టి. న‌ట‌రాజ‌న్ అద్భుతంగా రాణిస్తున్నాడు. త‌న యార్క‌ర్‌ల‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. కాగా శ‌నివారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో న‌ట‌రాజ‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో ఇప్పటి వ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన న‌ట‌రాజ‌న్ 15 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో ప్రస్తుతం న‌టరాజ‌న్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో న‌ట‌రాజ‌న్‌పై భార‌త మాజీ ఆట‌గాడు సునీల్ గవాస్క‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. న‌ట్టు ప్ర‌స్తుత ఫామ్‌ను చూస్తుంటే అత‌డు ఖ‌చ్చితంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ భార‌త జ‌ట్టులో ఉంటాడని గవాస్కర్ తెలిపాడు.

"అత‌డు యార్క‌ర్లు కింగ్ అని మనందరికీ తెలుసు. అత‌డు గాయం నుంచి కోలుకోని అద్భుతంగా రాణించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2021లో న‌ట‌రాజ‌న్ సేవ‌ల‌ను భార‌త్ కోల్పోయింది. అత‌డు 16 నుంచి 20 ఓవ‌ర్ల మ‌ధ్య అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించ‌డంతో భార‌త టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో అతడు ఖ‌చ్చితంగా ఉంటాడు. న‌ట‌రాజ‌న్ కూడా త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాలి అని భావిస్తున్నాడు.  న‌ట‌రాజ‌న్ ఆస్ట్రేలియా విమానం ఎక్క‌డానికి సిద్దంగా ఉండాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022 జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

చ‌ద‌వండి: IPL 2022: 'కోహ్లి వ‌రుస‌గా రెండు గోల్డెన్ డ‌క్‌లు.. మాకు క‌న్నీళ్లు తెప్పిస్తున్నాయి'

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement