ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్‌.. అందులో ధోని ఫ్రెండ్‌ కూడా!? | Five Domestic Cricket Players Retired At The End Of The 2024 Ranji Trophy Season - Sakshi
Sakshi News home page

ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్‌.. అందులో ధోని ఫ్రెండ్‌ కూడా!?

Published Tue, Feb 20 2024 9:50 AM

Five ignored domestic bigwigs retire after prominent Ranji careers - Sakshi

భారత దేశీవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2023-24 తుది అంకానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక టోర్నీ ఎలైట్‌ గ్రూపు లీగ్‌ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ప్రస్తుతం ప్లేట్‌ గ్రూపు ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితం తేలాల్సి ఉంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్లేట్‌ గ్రూపు ఫైనల్‌ మ్యాచ్‌లో మిజోరం, హైదరాబాద్‌ జట్లు తలపడతున్నాయి.

అయితే ఫైనల్‌ పోరులో హైదరాబాద్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. హైదరాబాద్‌ విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. ఇక ఇది ఇలా ఉండగా.. నాలుగు ఎలైట్‌ గ్రూపుల నుంచి మొత్తం 8 జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.

గ్రూప్‌ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్‌ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్‌ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్‌ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది రంజీట్రోఫీ సీజన్‌తో ఐదుగురు దేశవాళీ టాప్‌ క్రికెటర్లు రిటైర్‌ కానున్నారు. వారుఎవరో ఓ లూక్కేద్దం.

మనోజ్‌ తివారీ..
టీమిండియా మాజీ క్రికెటర్‌, బెంగాల్‌ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బిహార్‌తో మ్యాచ్‌ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. తన కెరీర్‌లో బెంగాల్‌ తరపున 148 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. తివారీ గతంలో భారత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

ధవల్ కులకర్ణి..
భారత ఫాస్ట్ బౌలర్, ముంబై వెటరన్‌ పేసర్‌ ధవల్ కులకర్ణి సైతం డొమాస్టిక్‌ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ అనంతరం కులకర్ణి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పకోనున్నాడు.  తన కెరీర్‌లో ముంబై తరపున ఇప్పటివరకు 95 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ధవల్‌.. 281 వికెట్లు పడగొట్టాడు. 2016లో ధోని సారథ్యంలోనే భారత తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. కులకర్ణికి ధోని నుంచి ఫుల్‌ సపోర్ట్‌ కూడా ఉండేది. అయితే తరువాత కులకర్ణి విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.

ఫైజ్ ఫజల్..
టీమిండియా ఓపెనర్‌, విధర్బ మాజీ కెప్టెన్‌ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా  హర్యానాతో మ్యాచ్‌ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్‌.. 24 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున ఫజల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

సౌరభ్‌ తివారి..
టీమిండియా వెటరన్‌, జార్ఖండ్‌ స్టార్‌ ప్లేయర్‌ సౌరభ్‌ తివారి కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా  రాజస్తాన్‌తో మ్యాచ్‌ అనంతరం తన 17 ఏళ్ల కెరీర్‌కు విడ్కోలు పలికాడు. సౌరభ్‌ తివారీ జార్ఖండ్‌ తరఫున 115 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున 3 వన్డేలు కూడా తివారీ ఆడాడు. 

వరుణ్‌ ఆరోన్‌
టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌, మరో జార్ఖండ్‌ క్రికెట్‌ వరుణ్‌ ఆరోన్‌ సైతం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌ అనంతరం ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి ఆరోన్‌ తప్పుకున్నాడు. 2008లో ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేసిన వరుణ్‌ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల హాల్స్‌ ఉన్నాయి.

Advertisement
 
Advertisement