breaking news
dhaval Kulkarni
-
ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్.. అందులో ధోని ఫ్రెండ్ కూడా!?
భారత దేశీవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2023-24 తుది అంకానికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక టోర్నీ ఎలైట్ గ్రూపు లీగ్ మ్యాచ్‌లు సోమవారంతో ముగిశాయి. ప్రస్తుతం ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్లేట్ గ్రూపు ఫైనల్ మ్యాచ్‌లో మిజోరం, హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. అయితే ఫైనల్ పోరులో హైదరాబాద్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. ఇక ఇది ఇలా ఉండగా.. నాలుగు ఎలైట్ గ్రూపుల నుంచి మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది రంజీట్రోఫీ సీజన్‌తో ఐదుగురు దేశవాళీ టాప్ క్రికెటర్లు రిటైర్ కానున్నారు. వారుఎవరో ఓ లూక్కేద్దం. మనోజ్ తివారీ.. టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. బిహార్‌తో మ్యాచ్ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. తన కెరీర్లో బెంగాల్ తరపున 148 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తివారీ.. 47.86 సగటుతో 10,195 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 30 సెంచరీలు ఉన్నాయి. తివారీ గతంలో భారత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ధవల్ కులకర్ణి.. భారత ఫాస్ట్ బౌలర్, ముంబై వెటరన్ పేసర్ ధవల్ కులకర్ణి సైతం డొమాస్టిక్ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ అనంతరం కులకర్ణి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి తప్పకోనున్నాడు. తన కెరీర్లో ముంబై తరపున ఇప్పటివరకు 95 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధవల్.. 281 వికెట్లు పడగొట్టాడు. 2016లో ధోని సారథ్యంలోనే భారత తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. కులకర్ణికి ధోని నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉండేది. అయితే తరువాత కులకర్ణి విఫలమకావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఫైజ్ ఫజల్.. టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా హర్యానాతో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున ఫజల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సౌరభ్ తివారి.. టీమిండియా వెటరన్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ సౌరభ్ తివారి కూడా ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం తన 17 ఏళ్ల కెరీర్‌కు విడ్కోలు పలికాడు. సౌరభ్ తివారీ జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. భారత్ తరఫున 3 వన్డేలు కూడా తివారీ ఆడాడు. వరుణ్ ఆరోన్ టీమిండియా ఫాస్ట్ బౌలర్, మరో జార్ఖండ్ క్రికెట్ వరుణ్ ఆరోన్ సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఆరోన్ తప్పుకున్నాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. -
ముంబై... 41వ సారి
రంజీ ట్రోఫీ సొంతం ఫైనల్లో సౌరాష్ట్రపై విజయం పుణే: రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చూపెట్టింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ రికార్డు స్థాయిలో 41వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన ఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. గత మూడు సీజన్లలో నిరాశజనక ప్రదర్శనతో విఫలమైన ముంబై ఈసారి మాత్రం అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన 45 ఫైనల్స్‌లో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై... 10సార్లు ఇన్నింగ్స్ తేడాతో నెగ్గడం విశేషం. 2012-13 ఫైనల్‌ను తలపించే రీతిలో సాగిన ఈ మ్యాచ్‌లో శుక్రవారం మూడోరోజు ముంబై బౌలర్లు మ్యాజిక్ చూపెట్టారు. కీలక సమయంలో ఒత్తిడి పెంచుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను చకచకా అవుట్ చేశారు. దీంతో సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లలోనే 115 పరుగులకే కుప్పకూలింది. చతేశ్వర్ పుజారా (27) టాప్ స్కోరర్. టాప్ ఆర్డర్లో బరోత్ (4), జోగియాని (9) తక్కువ స్కోరుకే అవుట్‌కావడంతో ఓ దశలో సౌరాష్ట్ర 67 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత కూడా ముంబై బౌలర్ల జోరు కొనసాగడంతో జైదేవ్ షా బృందం కోలుకోలేకపోయింది. ఓవరాల్‌గా 48 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. శార్దూల్ ఠాకూర్ 5, ధవల్ కులకర్ణి, బల్విందర్ సంధూ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 262/8 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 82.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సిద్ధేశ్ లాడ్ (88), బల్విందర్ సంధూ (34 నాటౌట్) రాణించారు. ఇక్బాల్ అబ్దుల్లా (15) తొందరగా అవుటైనా... లాడ్, సంధూ పదో వికెట్‌కు 103 పరుగులు జోడించి ముంబైకి భారీ ఆధిక్యాన్ని (136 పరుగులు) అందించారు. ఉనాద్కట్ 4, రాథోడ్ 3 వికెట్లు పడగొట్టారు. శ్రేయస్ అయ్యర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.