అంగరంగ వైభవంగా.. | The FIFA World Cup football tournament begins | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా..

Jun 12 2026 5:31 AM | Updated on Jun 12 2026 5:31 AM

The FIFA World Cup football tournament begins

‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ షురూ  

మెక్సికో సిటీ: విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్‌–2026 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. దాదాపు 90 వేల మంది సామర్థ్యం గల అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ఈ వేడుకలు సాగాయి. 

ఇందులో ప్రముఖ పాప్‌ సింగ్‌ షకీరా, డానీ ఓసియన్, బాల్విన్, బెలిండాతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ఆడిపాడారు. షకీరా ప్రపంచకప్‌ అధికారిక పాటకు కాలు కదపగా... స్టేడియం మొత్తం ఊగిపోయింది. కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ‘ఫిఫా’ వరల్డ్‌కప్‌ ట్రోఫీ భారీ నమూనాను మైదానంలో ప్రదర్శించగా... ఆ సమయంలో బాణాసంచా మోతతో స్టేడియంలో మరో ప్రపంచం ఆవిష్కృతమైంది. 

ప్రారంభ వేడుకలను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరగా... కళాకారుల విన్యాసాలు ఆహుతులను కట్టిపడేశాయి. టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ మాట్లాడుతూ... ‘ప్రశాంతంగా సేదతీరుతూ ఆస్వాదించండి’ అని పిలుపునిచ్చాడు. 2010 ప్రపంచకప్‌ మాదిరిగానే మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 వరల్డ్‌కప్‌ ప్రారంభమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement