FIFA WC 2022: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే

FIFA WC: Female Fans BANNED Wearing REVEALING Clothes-Showing Body Parts - Sakshi

మరో మూడురోజుల్లో సాకర్‌ సమరం మొదలుకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఈసారి అరబ్‌ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో జరగనుంది. ఈ మెగా సమరాన్ని వీక్షించేందుకు అన్ని దేశాల అభిమానులు ఇప్పటికే ఖతార్‌ బాట పట్టారు. అమెరికా, యూకే లాంటి దేశాల నుంచి చాలా మంది అభిమానులు ఖతార్‌కు చేరుకున్నారు. 

ఇక మ్యాచ్‌లు మొదలయితే ఆ కిక్కు వేరుగా ఉండనుంది. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరగనుంది. దాదాపు నెలరోజులపాటు జరగనున్న ఈ సమరం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌ జరిగిన ప్రతీసారి మహిళలు, యువతులు తమ అందచందాలతో అదనపు ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో మాత్రం మహిళల అందాల కనువిందు కష్టమే.

ఇస్లాం దేశాల్లో ఒకటైన ఖతార్‌లో సంప్రదాయాలకు విలువెక్కువ. మాములుగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు అభిమానులు ఎలాగైనా రావొచ్చు. లిక్కర్‌ కూడా అన్‌లిమిటెడ్‌. ఇక మ్యాచ్‌ చూసేందుకు వచ్చే యువతులు, మహిళలు బాడీపార్ట్స్‌ కనిపించేలా దుస్తులు వేసుకురావడం చూస్తునే ఉంటాం. ఇవన్నీ మిగతా దేశాల్లో నడుస్తుందేమో కానీ ఇస్లాం మతం గట్టిగా ఫాలో అయ్యే అరబ్‌ దేశాల్లో ఇలాంటివి నిషేధం.

వాస్తవానికి అరబ్‌ దేశాల్లో మద్యపానం బహిరంగ నిషేధం. అయితే ప్రతిష్టాత్మక​ ఫిఫా వరల్డ్‌‍కప్‌కు ఒక మిడిల్‌ ఈస్ట్‌ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండడంతో మరి కటువుగా ఉంటే పరిస్థితులు మారిపోతాయని పసిగట్టిన ఖతార్‌ దేశం కొన్ని నియమాలను సడలించింది. మ్యాచ్‌లకు వచ్చే ప్రేక్షకులు తమతో లిక్కర్‌ తెచ్చుకుంటే అనుమతిస్తామని ఖతార్‌ అధికార విభాగం తెలిపింది. అయితే బహిరంగంగా మాత్రం​ మద్యపానం ఎక్కడా అమ్మరని.. తమతో వచ్చేటప్పుడు తెచ్చుంటే ఎటువంటి అభ్యంతరం లేదని నిర్వాహకులు తెలిపారు.

కానీ మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ధరించే దుస్తులపై మాత్రం కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చే మహిళలు, యువతులు కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. శరీర బాగాలు కనిపించేలా అసభ్యకరమైన దుస్తులు వేసుకొస్తే స్టేడియంలోకి అనుమతించమని.. మాట వినకుంటే జైలుకు పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. 

అయితే ఫిఫా వెబ్‌సైట్‌లో మాత్రం మ్యాచ్‌ చూడడానికి వచ్చే అభిమానుల డ్రెస్‌ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ చాయిస్‌ వారికే వదిలేస్తున్నామని తెలిపింది.  కానీ దేశ నిబంధనల ప్రకారం శరీర బాగాలు కనిపించకుండా దుస్తులు వేసుకొని వస్తే మంచిదని పేర్కొంది. అయితే మ్యాచ్‌ చూడడానికి వచ్చే మహిళా అభిమానులకు ఈ ఆంక్షలు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నప్పటికి ఖతార్‌ దేశ నిబంధనల మేరకు నడుచుకోక తప్పదు.

చదవండి: భారతీయుల అభిమానానికి మెస్సీ ఫిదా..

ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా?


Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top