Cricket Fans Brutally Troll Indian Players For Dropped Catches - Sakshi
Sakshi News home page

IND vs SA: 'మీ కంటే బాల్‌ బాయ్‌ బెటర్‌.. అద్భుతమైన ‍క్యాచ్‌ పట్టాడు'

Oct 7 2022 1:26 PM | Updated on Oct 7 2022 2:39 PM

Fans brutally troll Indian players for dropped catches - Sakshi

PC: Twitter/ Disney+hotstar

లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. డెత్‌ ఓవర్లలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. అఖరి 5 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నారు.

అదే విధంగా భారత ఫీల్డర్లు కూడా దారుణ ప్రదర్శన కనబరిచారు. ప్రోటీస్‌ బ్యాటర్లు ఇచ్చిన నాలుగు ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు టీమిండియా భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ 38 ఓవర్‌ వేసిన అవేష్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తొలి బంతికి.. క్లాసన్‌ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సిరాజ్‌ జారవిడిచాడు.

అదే ఓవర్‌లో రెండో బంతికి మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను బిష్ణోయ్‌ విడిచిపెట్టాడు. దీంతో ఆ తర్వాతి రెండు బంతులను మిల్లర్‌ ఫోర్‌, సిక్స్‌గా మలిచాడు. కాగా మిల్లర్‌ కొట్టిన సిక్సర్‌ను బౌండరీ లైన్ బయట ఫీల్డింగ్ చేస్తున్న ఓ బాల్ బాయ్ అద్భుతంగా అందుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత ఫీల్డర్ల కంటే బాల్‌ బాయ్‌ చాలా బెటర్‌ అంటూ నెటిజన్‌లు ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'మీ కన్నా బాల్‌ బాయ్‌ బెటర్‌.. అద్భుతమైన ‍క్యాచ్‌ పట్టాడు' అంటూ కామెంట్‌ చేశాడు.


చదవండి: T20 World Cup 2022: న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!

Advertisement
 
Advertisement
Advertisement