Faf du Plessis: దక్షిణాఫ్రికాకు గుడ్‌ న్యూస్‌.. మూడేళ్ల తర్వాత స్టార్‌ క్రికెటర్‌ రీ ఎంట్రీ!

Faf du Plessis to return to Proteas white ball squad: Reports - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 2021లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రక‌టించిన డుప్లెసిస్.. ప్రోటీస్‌ వైట్‌ బాల్‌ జట్టు తరుపున ఆడేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొం‍టున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి డుప్లెసిస్‌ తప్పుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు.

డుప్లెసిస్‌ చివరిసారిగా 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రోటీస్‌ తరపున ఆడాడు. ప్రోటీస్‌ వార్తాపత్రిక ర్యాప్పోర్ట్ నివేదిక ప్రకారం.. డుప్లెసిస్ ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త వైట్‌ బాల్‌ కోచ్‌ రాబ్ వాల్టర్‌ కలిసినట్లు సమాచారం. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో డుప్లెసిస్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

కాగా డుప్లెసిస్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో ఫాప్‌ అదరగొట్టాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించిన డుప్లెసిస్‌ 369 పరుగులు సాధించాడు. ఇక విండీస్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌లకు తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్‌ సోమవారం ప్రకటించనుంది. మార్చి16న ఈస్ట్‌ లండన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ప్రోటీస్‌-విండీస్‌ వైట్‌ బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: WPL 2023: లేడీ సెహ్వాగ్‌ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top