రూట్‌ సెంచరీ.. ఎవరు ఊహించని సర్‌ప్రైజ్‌!

England Woman Cricketer Twerks To Celebrate Joe Root Century - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న రూట్‌.. తాజాగా రెండో టెస్టులోనూ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. నాటింగహమ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రూట్‌ 211 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 176 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు సందడి చేశారు. కేథరిన్‌ బ్రంట్.. ఆమె పార్టనర్‌ నాట్‌ సీవర్, మాజీ క్రికెటర్‌ ఇషా గుహాలు ఉన్నారు. కాగా రూట్‌ సెంచరీ చేయగానే సీటు నుంచి లేచిన కేథరిన్‌ బ్రంట్‌ తనదైన శైలిలో ఎంజాయ్‌ చేశారు. కేవలం నడుముని మాత్రమే కదిలిస్తూ హిప్‌ మూమెంట్స్‌ ఇచ్చింది. ఇది చూసిన నటా సీవర్‌కు నవ్వాగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం డారిల్‌ మిచెల్‌ 32, మాట్‌ హెన్రీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగడంతో న్యూజిలాండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 238 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చదవండి: Joe Root: ఎప్పుడు కొట్టని షాట్‌ ఆడాడు.. అందుకే ఆశ్చర్యపోయాడా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top