
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టు కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ బుధవారం ప్రకటించింది.
స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో కన్పించనున్నాడు. యువ పేసర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చర్‌ను తుది జట్టులోకి ఇంగ్లీష్ జట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చర్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బెంచ్‌కే పరిమితమ్యాడు.
ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్ సిద్దమయ్యాడు. ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మినహా రెండో టెస్టులో ఆడినే జట్టును ఇంగ్లండ్ కొనసాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మరో ఛాన్స్ ఇచ్చింది.
ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేటర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.
ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.