
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 532 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో రాహుల్ ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 5 మ్యాచ్‌ల్లో 6 క్యాచ్‌లు (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ ఇంకా కొనసాగుతుంది) పట్టాడు. స్లిప్స్‌లో రాహుల్ చాలా అలర్ట్‌గా ఉంటూ ఇంగ్లండ్ బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.
KL RAHUL HAS BEEN FANTASTIC IN SLIPS...!!! 💪 pic.twitter.com/juvyI9uH5R
— Johns. (@CricCrazyJohns) August 3, 2025
ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రాహుల్ బెన్ డకెట్ (ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో) క్యాచ్ పట్టడంతో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. ఇంగ్లండ్‌లో కోహ్లి టెస్ట్‌ల్లో 25 క్యాచ్‌లు పడితే.. తాజాగా రాహుల్ తన క్యాచ్‌ల సంఖ్యను 26కు పెంచుకున్నాడు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ (35), రాహుల్ ద్రవిడ్ (30) మాత్రమే రాహుల్ ముందున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా ఆడుతుంది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27) ఔట్ కాగా.. జో రూట్ (23), బ్రూక్ (38) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 210 పరుగులు చేయాలి. అదే భారత్ గెలుపుకు కేవలం 6 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) కావాలి.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.