చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం

షార్జా: ఐపీఎల్ తాజా సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడి డీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, ఆల్‌రౌండర్ బ్రేవో కుడి కాలి తొడ కండరాల గాయంతో చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. అయితే ఎంత కాలం అతడు డగౌట్‌కే పరిమితమవుతాడనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజులు లేదా రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఫ్లెమింగ్ వెల్లడించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గాయపడ్డాడు. దాంతో తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి