ప్రతీకారం.. చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న​ జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్‌

Djokovic Celebrates Ripping Off His Shirt, Alcaraz Breaks Into Tears After Djokovic Wins Cincinnati Open Title - Sakshi

టెన్నిస్‌ దిగ్గజం, వరల్డ్‌ నంబర్‌-2 ప్లేయర్‌, సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్‌ ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్‌-2023 ఫైనల్లో  అల్కరాజ్‌ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు.

3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్‌.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్‌ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్‌ మధ్య 2010లో జరిగిన మ్యాచ్‌ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్‌కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌గా ఉండింది.

ఈ మ్యాచ్‌లో జకోవిచ్‌, అల్కారాజ్‌ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్‌ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్‌ నంబర్‌ ప్లేయర్‌ అల్కారాజ్‌ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top