పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఒకే మ్యాచ్‌లో జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఫీట్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 వేదికైంది.
ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే స్టేడియంలో మణిపూర్‌తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది బౌలింగ్ చేశారు. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని జట్టులో ప్రతీ ఒక్కరితో బౌలింగ్ చేయించాడు. ఆఖరికి వికెట్ కీపర్‌గా ఉన్న బదోని సైతం ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు.
తద్వారా టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 11 మంది బౌలర్లను ఉపయోగించిన తొలి జట్టుగా ఢిల్లీ రికార్డులకెక్కింది. టీ20ల్లోఒకే ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్, ఆర్సీబీ జట్లు తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాయి. తాజా మ్యాచ్‌తో ఈ అల్‌టైమ్ రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.
కాగా ఢిల్లీ జట్టుకు సంబంధించి స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. . హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ తలా మూడు ఓవర్లు బౌలింగ్ చేశారు.
వీరితో పాటు ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్, రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశారు. త్యాగీ, దిగ్వేష్ తలా రెండు వికెట్లు సాధించగా.. బదోని, అయూష్ సింగ్, ప్రియాన్షూ ఆర్య చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment