
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా సౌతాఫ్రికా ఆతిథ్య టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. టెస్టు సిరీస్‌తో ప్రోటీస్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరగనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన తేదీలను ఇంకా వెల్లడించలేదు. ఇక రెండో టెస్టు మాత్రం గౌహతిలోని బర్సాపర క్రికెట్ స్టేడియం వేదికగా నవంబర్ 22 నుండి నవంబర్ 26 వరకు జరగనుంది. గౌహతి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం నవంబర్ 30న రాంఛీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్, మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికలగా జరగనుంది.
మరో టీ20 వరల్డ్‌కప్‌పై కన్ను..
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2026కు సన్నద్దం కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఎక్కువగా టీ20 సిరీస్‌లను షెడ్యూల్ చేసింది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు ఏకంగా 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగానే స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. డిసెంబర్ 9న కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు సిరీస్
తొలి టెస్టు: - : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం
రెండో టెస్టు: నవంబర్ 22 నుండి నవంబర్ 26-గౌహతి
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్:
నవంబర్ 30: రాంచీ
డిసెంబర్ 3: రాయ్‌పూర్
డిసెంబర్ 6: వైజాగ్
భారత్ vs సౌతాఫ్రికా T20I సిరీస్:
1st T20I: డిసెంబర్ 9: కటక్
2nd T20I: డిసెంబర్ 11: నాగ్‌పూర్
3rd T20I: డిసెంబర్ 14: ధర్మశాల
4th T20I: డిసెంబర్ 17: లక్నో
5th T20I: డిసెంబర్ 19: అహ్మదాబాద్
చదవండి: ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?