CSK CEOs Big Update On Skippers Knee Injury, MS Dhoni Not Going To Play Until January-February - Sakshi
Sakshi News home page

IPL 2023: ధోని చాలా గ్రేట్‌.. తన సమస్య గురించి ఎవరికీ చెప్పలేదు! ఆఖరికి

Jun 21 2023 4:19 PM | Updated on Jun 21 2023 4:47 PM

CSK CEOs Big Update On Skippers Knee Injury - Sakshi

ఐపీఎల్‌-2023 ఛాంపియన్స్‌గా ధోని సారధ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌ విజయంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు అందుకున్న ముంబై ఇండియన్స్‌ రికార్డును సీఎస్‌కే సమం చేసింది. సీఎస్‌కేకు ఇది ఐదో ఐపీఎల్‌ టైటిల్‌. ఇక సీఎస్‌కే ఐదో సారి చాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు కెప్టెన్‌ ఎంస్‌ ధోనిది కీలక పాత్ర.

ఈ ఏడాది సీజన్‌లో ధోని మోకాలి గాయంతో బాధపడతున్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌కు దూరం కాకుండా తన జట్టును ముందుకు నడిపించాడు. అయితే ఐపీఎల్‌ ముగిశాక తన మెకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ఇదే విషయంపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తాజాగా స్పందించాడు. ధోని తన గాయం గురించి తమతో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని విశ్వనాథన్ తెలిపాడు.

"ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాలేదు. జట్టు పట్ల అతడికి ఉన్న నిబద్ధత అటువంటింది. అతడి లీడర్‌ షిప్‌లో మా జట్టు ఎలా ముందుకు వెళ్తుందో అందరికీ తెలుసు. అతడు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన లీడర్‌. అయితే మేము కూడా ఏరోజు అతడిని ఆడాలనుకుంటున్నావా లేదా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నవా అని అడగలేదు.

ఎంఎస్‌కు మరి కష్టంగా ఉంటే అతడే మాతో చెప్పేవాడు. ఫైనల్‌ మ్యాచ్‌ వరకు అతడు తన గాయం గురించి మాకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఆఖరికి ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత తన మోకాలికి సర్జరీ చేసుకున్నాడు. అతడి సర్జరీ సక్సెస్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథన్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: భారత్‌- పాక్‌ మ్యాచ్‌లు జరుగకపోతే అంతే సంగతులు! ఈ ‘చెత్త విధానం’ వల్ల..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement