Cricketer Ambati Rayudu Met AP CM YS Jagan Mohan Reddy - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అంబటి​ రాయుడు

May 11 2023 2:58 PM | Updated on May 11 2023 3:57 PM

Cricketer Ambati Rayudu Met AP CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement