దంచికొట్టిన రొమారియో షెపర్డ్‌.. ప్రిటోరియస్‌ ఆల్‌రౌండ్‌ షో | CPL 2023: Guyana Amazon Warriors Beat St Kitts And Nevis Patriots By 98 Runs | Sakshi
Sakshi News home page

CPL 2023: దంచికొట్టిన రొమారియో షెపర్డ్‌.. ప్రిటోరియస్‌ ఆల్‌రౌండ్‌ షో

Sep 3 2023 3:16 PM | Updated on Sep 3 2023 3:41 PM

CPL 2023: Guyana Amazon Warriors Beat St Kitts And Nevis Patriots By 98 Runs - Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా సెయింట్‌ కిట్స్‌ నెవిస్‌ అండ్‌ పేట్రియాట్స్‌తో నిన్న (సెప్టెంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ 98 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా.. సైమ్‌ అయూబ్‌ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్‌), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (22 బంతుల్లో 36; ఫోర్‌, 3 సిక్సర్లు), కీమో పాల్‌ (31 బంతుల్లో 41 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), ప్రిటోరియస్‌ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్‌), రొమారియో షెపర్డ్‌ (7 బంతుల్లో 26 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పేట్రియాట్స్‌ బౌలర్లలో ఒషేన్‌ థామస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. కోర్బిన్‌ బోష్‌, జార్జ్‌ లిండే, డొమినిక్‌ డ్రేక్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్‌.. ప్రిటోరియస్‌ (3-0-17-3), గుడకేశ్‌ మోటీ (4-0-15-2), రొమారియో షెపర్డ్‌ (1/19), జూనియర్‌ సింక్లెయిర్‌ (1/10), సైమ్‌ అయూబ్‌ (1/2) ధాటికి 17.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. పేట్రియాట్స్‌ ఇన్నింగ్స్‌లో అందరూ దారుణంగా విఫలమయ్యారు. కోర్బిన్‌ బోష్‌ (27), జార్జ్‌ లిండే (13), ఆండ్రీ ఫ్లెచర్‌ (11), యాన్నిక్‌ కారియా (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఓటమితో ప్రస్తుత ఎడిషన్‌లో పేట్రియాట్స్‌ పరాజయాల సంఖ్య 5కు చేరింది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ గెలువలేదు. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement