ఫ్రెంచ్‌ ఓపెన్‌కు అల్‌కరాజ్‌ దూరం | Carlos Alcaraz withdraws from French Open | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు అల్‌కరాజ్‌ దూరం

Apr 25 2026 3:01 AM | Updated on Apr 25 2026 3:01 AM

Carlos Alcaraz withdraws from French Open

పారిస్‌: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌తోపాటు రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీలో ఆడటం లేదని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ ప్రకటించాడు. 2024, 2025లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గినఅల్‌కరాజ్‌ గత ఏడాది రోమ్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచాడు. ఈ రెండు టోర్నీలకు అల్‌కరాజ్‌ దూరం కానుండటంతో 3000 ర్యాంకింగ్‌ పాయింట్లు కోల్పోనున్నాడు. గతవారం బార్సిలోనా ఓపెన్‌ సందర్భంగా అల్‌కరాజ్‌ మణికట్టు గాయంతో టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement