ఆండ్రీ రసెల్‌ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్‌రేట్‌తో..!

BPL 2024: As Andre Russell Blasts, Comilla Victorians Beat Rangpur Riders By 6 Wickets - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌ ఆటగాడు, విండీస్‌ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్‌ శివాలెత్తిపోయాడు. రంగ్‌పూర్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్‌రేట్‌తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్‌ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రైడర్స్‌.. రసెల్‌, ముస్ఫిక్‌ హసన్‌ (3/18), మథ్యూ ఫోర్డ్‌ (2/32), తన్వీర్‌ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో నీషమ్‌ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్‌) రాణించాడు. నీషమ్‌తో పాటు రోనీ తాలుక్‌దార్‌ (14), షకీబ్‌ అల్‌ హసన్‌ (24) మాత్రమే రెండంకెల​ స్కోర్లు చేశారు. 

అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్‌.. రసెల్‌ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్‌ ఇన్నింగ్స్‌లో రసెల్‌తో పాటు లిటన్‌ దాస్‌ (43), మహిదుల్‌ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్‌ నరైన్‌ 15 పరుగులు మాత్రమే​ చేసి ఔట్‌ కాగా.. మొయిన్‌ అలీ (6 నాటౌట్‌) రసెల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్‌ బౌలర్లలో షకీబ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్‌ రోని ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top