యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం | Big Blow to Australia, David Warner Misses pink ball Adelaide Test | Sakshi
Sakshi News home page

David Warner: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌.. డేవిడ్‌ వార్నర్‌కు గాయం

Dec 13 2021 3:47 PM | Updated on Dec 13 2021 3:50 PM

Big Blow to Australia, David Warner Misses pink ball Adelaide Test - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్ట్‌లో 94 పరుగులు సాధించి జట్టు విజయంలో వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు. వార్నర్‌ స్ధానంలో ఉస్మాన్ ఖవాజా తుది జట్టులోకి రానున్నాడు.

ఇక తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్‌ సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ వేదికగా రెండో టెస్ట్‌ డిసెంబర్‌16న ప్రారంభం కానుంది. అదే విధంగా ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ కూడా రెండో టెస్ట్‌కు గాయంతో దూరమైన  సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా జట్టు( అంచనా): పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్  మార్కస్ హారిస్ అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్,  ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్,  జో రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, 

Advertisement
 
Advertisement
Advertisement